ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2022-12-06T23:57:10+05:30

శంషాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ రూ.50కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ. రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే టి.ప్రకాష్‌ గౌడ్‌లు తెలిపారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, డిసెంబరు 6: శంషాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ రూ.50కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ. రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే టి.ప్రకాష్‌ గౌడ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయత్రం శంషాబాద్‌ అంబేడ్కర్‌చౌరస్తాలో సంబురాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఎంపీ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలసి నృత్యం చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే

శంషాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ తెలిపారు. చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శంషాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం టీయూఎ్‌ఫఐడీసీ కింద రూ.20కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోటా నుంచి ఎస్‌డీఎఫ్‌ నుంచి 4 కోట్లు, మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి మరో రూ.4కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కాగా మరో రూ.50కోట్లతో శంషాబాద్‌ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. కాగా, తన వార్డుకు సరైన నిధులు కేటాయించలేదని కౌన్సిలర్‌ ప్రవీణ్‌గౌడ్‌ సమావేశాన్ని బైకాట్‌ చేసి వెళ్లారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌, కౌన్సిలర్లు వై.కుమార్‌, సంజయ్‌ యాదవ్‌, కౌన్సిలర్లు కమీషనర్‌ సాబేర్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising