ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RangaReddy టీఆర్‌ఎస్‌లో ఆదిపత్య పోరు.. Cm Kcr ఏం చేస్తారో..!

ABN, First Publish Date - 2022-07-19T01:09:31+05:30

రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌(Trs)లో వర్గపోరు భగ్గుమంటోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో టీఆర్‌ఎస్‌ కిక్కిరిసిపోయింది. ఫలితంగా నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్ళు, ప్రతిసవాళ్ళ విరుసుకుంటూ పార్టీలో కాక పుట్టిస్తున్నారు. 


టీఆర్‌ఎస్‌ ఏర్పడిన తొలినాళ్ళలో రంగారెడ్డి జిల్లా (RangaReddy District)లో బలహీనంగా ఉన్నా ఆపరేషన్‌ ఆకర్ష్‌ ‎తో ఇతర పార్టీ నేతలను సీఎం కేసీఆర్‌ (Cm Kcr) కారెక్కించారు. ఫలితంగా రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌కు పెట్టనికోటలామారింది. కానీ ఇప్పుడీ కోటకు బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి జిల్లాలో కేడర్ మొత్తం వర్గాలుగా చీలిపోయింది. ఈ వర్గాలన్నీ ఎవరికి వారే  ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. కొద్ది రోజులుగా తాండూరు (Tandur), మహేశ్వరం (Maheswaram) నియోజక వర్గ టీఆర్ఎస్‎లో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. రోజుకో నియోజకవర్గంలో అసమ్మతి నేతలు గళం విప్పుతుండటంతో గులాబీ పార్టీలో అలజడి పెరుగుతోంది. 


మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల సంచలన వ్యాఖ్యలు 

మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy), మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Ex Mla Teegala Krishna Reddy) మధ్య వార్ ముదిరింది. మీర్‎పేట్ (Meerpet) చెరువులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‎తో ఉమ్మడి జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి సబిత అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తీగల సంచలన ఆరోపణ చేశారు. మరో నేత కొత్త మనోహర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)సైతం సబిత టార్గెట్‎గా ఆరోపణలు చేయటం మహేశ్వరం కారులో మంటలు పుట్టించింది. 


ఇక తాండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Mla Pilot Rohith Reddy), మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (MlcPatnam Mahender  Reddy) మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‎లో గెలిచి టీఎర్ఎస్‎లో చేరారు. అప్పటి నుంచి మహేందర్ రెడ్డితో పొసగడం లేదు. వీరి పంచాయితీ ప్రగతి భవన్‎కు చేరినా ఫలితం లేక పోయింది. 


వికారాబాద్‎లో వీధికెక్కిన వర్గపోరు 

తాజాగా వికారాబాద్‎లో వర్గపోరు వీధికెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వర్గీయులు రోడ్డెక్కి కొట్టుకున్నారు. మహేందర్ రెడ్డి సతీమణి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి (Zp Chairman Sunitha Reddy) ప్రోటోకాల్ పాటించలేదని ఆనంద్ వర్గీయులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే వర్గం ఏకంగా జెడ్పీ చైర్ పర్సన్ కారును ధ్వంసం చేశారు. ఈ పంచాయితీ అధిష్టానం వరకు చేరడంతో మంత్రి కేటీఆర్‌ (Minister Ktr) రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఇక విభేదాలు ఇలా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంచుకోటకు బీటలు వారటం ఖాయమనే అభిప్రాయాలు గులాబీ దళంలో వినిపిస్తున్నాయి. 



Updated Date - 2022-07-19T01:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising