ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను?: రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-01-06T16:04:50+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా.. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ తెలిపాడు. ఇంకా సెల్ఫీ వీడియోలో రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు. నిన్ను అన్ని విధాల కాపాడుకుంటానని ప్రమాణం చేసి తనను రాఘవ దగ్గరకు ఎలా పంపగలను? రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని కానీ నా భార్యను కోరుకున్నాడు. అది ఎలా ఇవ్వగలను? నేను ఒక్కడినే చనిపోదామనుకున్నా.. కానీ ఆ తరువాత కూడా నా భార్య పిల్లలకు ఇబ్బందులు తప్పవని నాతోనే వాళ్లని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నా. నీ భార్యను నా దగ్గరకు పంపు.. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నీకు రాదు.. నిన్ను ఎవరూ కాపాడలేరు’ అని రాఘవ బెదిరించాడు. అందుకే ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా. నాకు నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తిని అమ్మి ఎవరికీ అన్యాయం జరగకుండా అప్పులు చెల్లించండి. నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి నా తల్లి, అక్క సైతం వేధింపులకు పాల్పడ్డారు’’ అని తెలిపాడు.

Updated Date - 2022-01-06T16:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising