ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఘవ వల్లే నా కూతురు కుటుంబం బలైంది: రమాదేవి

ABN, First Publish Date - 2022-01-08T00:42:12+05:30

వనమా రాఘవ పెట్టిన ఇబ్బందుల వల్లే కుటుంబం బలైందని, అతడిని కఠినంగా శిక్షించాలని నాగ రామకృష్ణ అత్త రమాదేవి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ: వనమా రాఘవ పెట్టిన ఇబ్బందుల వల్లే కుటుంబం బలైందని, అతడిని కఠినంగా శిక్షించాలని నాగ రామకృష్ణ అత్త రమాదేవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆమె మీడియా ఎదుట తన గోడు చెప్పుకొన్నారు. ఏనాడూ తన కూతురు, అల్లుడు వారి సమస్యలను తమకు చెప్పలేదని, చెప్పి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని విలపించారు. తన అల్లుడు  రాఘవ వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి  పాల్పడ్డాడని తెలిపారు. తన కూతురు కుటుంబం ఎదుర్కొన్న దుర్బర స్థితి మరే కుటుంబానికి జరగకుండా ఉండాలంటే రాఘవకు కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు. రామకృష్ణ బావమరిది జనార్దన్‌ మాట్లాడుతూ సమస్య ఉందని వెళితే వారి ఇబ్బందులను ఆసరా చేసుకొని నీచాతి నీచంగా మాట్లాడిన వనమా రాఘవను క్షమించకూడదని, దేశంలో మరేవ్వరూ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా కఠినం శిక్షించాలని కోరారు. 

Updated Date - 2022-01-08T00:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising