ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: రాజాసింగ్

ABN, First Publish Date - 2022-03-07T21:10:48+05:30

ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అసెంబ్లీలో ఉంటే తమ హక్కుల్ని కాలరాస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలను సెషన్ అంతా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగంగానే తమను సస్పెండ్ చేశారని అన్నారు. మహాత్మాగాంధి విగ్రహం దగ్గర నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని, తమ హక్కులను హరించే హక్కు సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గౌరవ సభ్యులమని కూడా చూడకూండా మమ్మల్ని అసెంబ్లీ ఆవరణ నుంచి పోలీసులు ఏ విధంగా అరెస్టు చేస్తారన్నారు. హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు.


రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభా సంప్రదాయల్ని పాటించకుండా ప్రతిపక్ష శాసన సభ్యుల గొంతు నొక్కుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకుని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడపుతున్నారన్నారు. ఈ సీఎం నయా నిజాం అనుకుంటున్నారని, నిరంకుశంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవనీయమని, ఈ నయా నిజాం రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని రాజాసింగ్ అన్నారు.

Updated Date - 2022-03-07T21:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising