ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-04T10:30:13+05:30

కాంగ్రెస్‌ భిక్షతో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌ రెడ్డి.. నిస్సిగ్గుగా కుంటిసాకులతో పార్టీకి రాజీనామా చేస్తున్నాననడం అవకాశవాదానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్‌ గౌడ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ భిక్షతో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌ రెడ్డి.. నిస్సిగ్గుగా కుంటిసాకులతో పార్టీకి రాజీనామా చేస్తున్నాననడం అవకాశవాదానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్‌ గౌడ్‌ విమర్శించారు. రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అనేక అవకాశాలు కల్పించి గుర్తింపునిస్త.. నమ్మకద్రోహానికి వారసుడిగా మారిపోయారన్నారు. స్వార్థపూరిత, వ్యక్తిగత లాభం కోసం పార్టీ ఫిరాయిస్తున్నాడని దుయ్యబట్టారు. కన్నతల్లిలాంటి పార్టీని కన్నకొడుకుల్లా ఆదరించాల్సింది పోయి.. దొంగ కొడుకుల్లా తయారై పార్టీని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌ జెండాను మరోసారి ఎగురవేయాల్సిన చారిత్రక అవసరముందని సుధాకర్‌ గౌడ్‌ అన్నారు.

Updated Date - 2022-08-04T10:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising