ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-08-20T00:08:47+05:30

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh) ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh) ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామనడంతో.. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు. మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు. వేదికను తగలబెడతామని ఇప్పటికే బీజేవైఎం, రాజాసింగ్‌ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శిల్పకళా వేదికను రేపటికి నిర్వాహకులు బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్‌ నిర్వాహకులు చెల్లించలేదు. కామెడీ షో(Comedy Show)లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీ(DGP)ని సైతం కలిశారు. అయినా కూడా ఈ షోకు అనుమతి లభించింది. ఇక రేపే షో జరగనుండటంతో తెలంగాణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. కర్ణాటక సర్కార్(Karnataka Government) మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది. 

Updated Date - 2022-08-20T00:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising