ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాడో ఎమ్మెల్యేగా రాఘవ చలామణి

ABN, First Publish Date - 2022-01-08T01:49:33+05:30

వనమా రాఘవ తండ్రి ఎమ్మెల్యే అయితే పెత్తనం ఆయనే చేస్తూ.. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం: వనమా రాఘవ తండ్రి ఎమ్మెల్యే అయితే పెత్తనం ఆయనే చేస్తూ.. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడు. నియోజకవర్గంలో ఏపని జరగాలన్నా తననే ప్రసన్నం చేసుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఎస్‌ఐల పోస్టింగ్‌ల నుంచి ఆశావర్కర్ల నియామకం వరకు అంతా తన కనుసన్నల్లోనే జరగాలంటాడు. తండ్రి పదవి అడ్డంపెట్టుకొని భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేయడమే కాదు అక్రమ ఆస్తుల సంపాదనే ధ్యేయంగా పావులు కదుపుతూ ఉంటాడు. ఆయన ఓ నియంత, ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు కొత్తగూడెం నియోజకవర్గంలో చలామణి అవుతూ వివాదాలకు కేంద్రంగా మారాడు. ఎవరైనా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవాలంటే ఆయన అనుమతి తీసుకోవడంతో పాటు కోరినంత భూమిని ఆయన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే.


ఇప్పటి వరకు ఆయన పేరుతో, బినామీల పేరుతో వందల సంఖ్యలో, వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయంటే అతిశయోక్తికాదు.  నియోజకవర్గంలో మట్టి, ఇసుక, ల్యాండ్‌, గుట్కా, లిక్కర్‌, నల్లబెల్లం మాఫీయాలు చలామణి కావాలంటే రాఘవకు ముడుపులు చేరాల్సిందే. లేదంటే కేసులు తప్పవు. ఇదే క్రమంలో ఏకంగా ఆబ్కారీశాఖలో ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిపై కూడా కేసు నమోదు చేయించిన ఘనుడిగా రాఘవకు పేరుంది. పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం బలవడానికి కూడా ఆయనే కారణం కావడంతో రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా చర్చకు వస్తున్నాయి. సుమారు 30ఏళ్లుగా ఆయన చేస్తున్న కీచకపర్వానికి చట్టం ద్వారా ఇకనైనా అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-08T01:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising