తుదిశ్వాస విడిచిన పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ
ABN, First Publish Date - 2022-07-25T03:06:50+05:30
Telangana: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్యోగం విషమించడంతో కడ్తాల్‌లోని
Telangana: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (Subhash Patri) (74) కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్యోగం విషమించడంతో కడ్తాల్‌లోని కైలాసపురి (Kailasapuri) మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన అక్కడ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు తరలి రావాలని కోరారు.
నిజామాబాద్‌లోని బోధన్‌లో జన్మించిన సుభాష్ పత్రిజీ గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఎరువుల కంపెనీలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించారు. అదే ఏడాది డిసెంబర్ 18 నుంచి జనవరి 31వ తేదీవరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు.
Updated Date - 2022-07-25T03:06:50+05:30 IST