ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్కరాల పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-04-08T06:22:36+05:30

పుష్కరాల పనులు వేగవంతం చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌, ఏప్రిల్‌ 7: కాళేశ్వరంలో ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే ప్రాణహిత పుష్కరాల పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు. కాళేశ్వరాలయంలోని ఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికా రులతో ఆయన సమావేశమయ్యారు. పుష్కరాల ఏర్పాట్లపై ఆరా తీశారు. పునుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. గతంలో జరిగిన ప్రాణహిత పుష్కరాల సమ యంలో వంతెనలు లేకపోవడం వల్ల భక్తుల సంఖ్య పరిమితంగానే ఉండేదన్నారు. ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదులపై మూడు రాష్ట్రాలను కలుపుతూ వంతెనలు నిర్మించిన నేపథ్యంలో ఈసారి భక్తుల రాక భారీగా ఉంటుందని అన్నా రు. వేసవిలో పుష్కరాలు జరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సౌకర్యాల ఏర్పాట్లలో రాజీపడొద్దని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. సమావేశం అనంతరం పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.  డ్రెస్సింగ్‌ రూములు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. బస్టాండ్‌, పార్కింగ్‌ స్థలాల వద్ద కూడా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పారిశుధ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. ఆయన వెంట కాళేశ్వరాలయ ఈ వో మహేశ్‌, కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ ఈఈ రమేష్‌బాబు, ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ, మహదేవపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శంకర్‌ నాయక్‌, ఎంపీపీ రాణిబా యి, సర్పంచ్‌ వసంత, ఎంపీటీసీ మమత తదితరులు ఉన్నారు 


 

Updated Date - 2022-04-08T06:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising