ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చగొట్టేలా అగ్నిపథ్‌ నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-06-22T08:45:48+05:30

నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ కోసం నోటిఫికేషన్‌ ప్రకటించిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువత ఉత్సాహంపై కేంద్రం నీళ్లు చల్లుతోంది: హరీశ్‌ 

మంథని, జూన్‌ 21: నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ కోసం నోటిఫికేషన్‌ ప్రకటించిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలకునే యువత ఉత్సాహంపై కేంద్రం నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో రూ.ఏడు కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మంథని నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అగ్నిపథ్‌లో నియమితులైన యువత నాలుగేళ్లు సైన్యంలో పనిచేసి, బయటికెళ్లాక ఏం చేసుకొని బతకాలని ప్రశ్నించారు. తాము రూ.400 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో మతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీడియాట్రీషన్లు, గైనకాలజిస్టు, మత్తు డాక్టర్లును నియమిస్తామని చెప్పారు. రాష్ట్రం రాక ముందు మూడు వైద్య కళాశాలలు ఉంటే వాటి సంఖ్యను 33కు పెంచామని అన్నారు. 

Updated Date - 2022-06-22T08:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising