పోడు భూముల కోసం ఆందోళన
ABN, First Publish Date - 2022-10-18T05:12:16+05:30
పోడు భూముల కోసం ఆందోళన
కాటారం, అక్టోబరు 17: పోడు భూములు కే టాయించాలని కోరుతూ గిరిజన సంఘాల ఆ ధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం నిర సన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమా రు 200మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. చిద్నెపల్లి, ప్రతాపగిరి జీపీల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టం భూమయ్య, తెలంగాణ ఆది వాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలం రాజేందర్, సేవా సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి ఇనుముల సంతోష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ భూమిలో తాము పొదలు, చెట్లు నరికి పోడు చేస్తే అటవీ అఽధికారులు తమను భూమిలోకి రానివ్వడం లేదని మండిపడ్డారు. మండలంలో ని చిద్నెపల్లి ప్రతాపగిరి జీపీల పరిధిలో ఎఫ్ ఆర్సీ కమిటీలను వేయకుండా రెండున్నర దశా బ్దాల క్రితం వందల ఎకరాలు పోడు చేసుకున్న దళితులు, ఆదివాసీలను అడవిలోకి రాకుండా అధికారులు అడ్డుకోవడం దారుణమన్నారు. 118 మంది ప్రజలు భూమిని సాగు చేస్తే 1996లో అధికారులు కేసులు పెట్టారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కన్నా ఎంతో ముందే పోడు చేసుకున్న వారందరి భూములను సర్వే చేసి హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు జాయింట్ సర్వే చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌రావుకు వినతిపత్రమందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ క్రాంతి, అదివాసీ సంఘాల నాయకులు రమేష్, వినోద్, వెంకటయ్య, మల్లయ్య, రమేష్, సుశీల, లక్ష్మయ్య, సమ్మయ్య, రాజయ్య, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:12:16+05:30 IST