ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల సాగును ప్రోత్సహించండి

ABN, First Publish Date - 2022-06-30T08:45:11+05:30

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకొని వారిని ఉద్యాన, కూరగాయల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులతో మంత్రి నిరంజన్‌..పంటల నమోదు ‘యాప్‌’ విడుదల 

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకొని వారిని ఉద్యాన, కూరగాయల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సంయుక్త ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో బంతిపూల మొక్కలు నాటాలని సూచించారు. కాగా, ఏఈవోలు పంటల నమోదు చేయటానికి రూపొందించిన ‘ఏఈవో యాప్‌’ను మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఏ సర్వే నెంబరులో? ఏ రైతు? ఏ పంట? వేశారనే వివరాలను ఏఈవోలు ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అదేక్రమంలో ఏఈవోల ప్రొఫైల్‌, సెల్ఫీ ఇమేజ్‌లు, రైతు వేదికలో సమావేశాలు, రెవెన్యూ గ్రామాల వారీ వివరాలు, రైతుబీమా క్లెయిమ్స్‌ వెరిఫికేషన్‌... తదితర వివరాలనూ నమోదు చేయనున్నారు.  

Updated Date - 2022-06-30T08:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising