ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా, ఉక్రెయిన్ మధ్యయుద్ధ వాతావరణం ఒక్కరోజులో ఏర్పడ్డది కాదు

ABN, First Publish Date - 2022-03-06T01:35:59+05:30

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఒక్క రోజులో ఏర్పడ్డది కాదని, దాని వెనుక మూడు దశాబ్ధాల చరిత్ర వుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఒక్క రోజులో ఏర్పడ్డది కాదని, దాని వెనుక మూడు దశాబ్ధాల చరిత్ర వుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. నాడు క్యూబా విషయంలో అమెరికాకు ఏర్పడ్డ గడ్డు పరిస్థితే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో రష్యాకు ఏర్పడిందని వివరించారు. డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, సామాజిక శాస్ర్తాల విభాగం ఆద్వర్యంలో నిర్వహించే ‘ఓపెన్ టాక్’ కార్యర్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘ ఉక్రెయిన్ సంక్షోభం: పరిణామాలు,పర్యవసానాలు’ అన్న అంశం పై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నయుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలనుకోల్పోతున్నారని అన్నారు. అఖండ రష్యా కోసం పుతిన్ పరితపిస్తున్నారని, అమానవీయంగా దాడులకు దిగడం అంతర్జాతీయచట్టాలను ఉల్లంఘించడం దురద`ష్ణకరమని అన్నారు. రష్యాతో భారత్ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండగా, అమెరికాతో వ్యూహాత్మకంగా సంబంధాలు ఉన్నాయని అన్నారు. 


ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం తటస్థంగా ఉంటూనే పెద్దన్న పాత్ర పోషించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ పై రష్యా దాడితో అమెరికా వాణిజ్య,వ్యాపర వ`ద్ధి పెరగనుందని, అమెరికాలోని వ్యాపారస్తులు కూడా కోరుకునేది అదేనని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యఓత వహించిన యూనివర్శిటీ సామాజిక శాస్ర్తాల విభాగం డీన్ సార్వత్రిక సామాజిక వేదిక రూపకర్త, ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సార్వత్రిక సామాజిక వేదిక అవసరాన్ని ఆవశ్యకతను వివరించారు. ఈ వేదిక ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా జరిగే అనేక పరిణామాలపై విద్యార్ధులకు, పరిశోధకులకు అవగాహన కల్పించడమే ధ్యేయంగంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.శాట్ సీఈవో శైలేశ్ రెడ్డి, ఓయూ మాజీ ప్రొఫెసర్ చిన్నబసవయ్య పాల్గొని ప్రసంగించారు. 

Updated Date - 2022-03-06T01:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising