ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4.23 కోట్ల టన్నుల బియ్యం సేకరణ: కేంద్రం

ABN, First Publish Date - 2022-08-04T09:32:19+05:30

ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి 4.23 కోట్ల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులను నాశనం చేస్తున్న ప్రభుత్వాలు: ఉత్తమ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి 4.23 కోట్ల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 50.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 28.96 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించామని పేర్కొన్నారు. కాగా, పరిమితి మేరకు బియ్యం సేకరించకుండా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతులను నాశనం చేస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సభలో ఆరోపించారు. ధాన్యం సేకరణను నిలిపివేయలేదంటూ కేంద్రం ప్రజలను తప్పదోవ పట్టిస్తోందన్నారు.   

Updated Date - 2022-08-04T09:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising