ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2022-07-23T22:59:16+05:30

ప్రధాని మోదీ (Prime Minister Modi) విధానాలతో దేశ భద్రతకు ముప్పు అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీ (Prime Minister Modi) విధానాలతో దేశ భద్రతకు ముప్పు అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ నిర్ణయాలు త్రివిధ దళాలను బలహీనపరుస్తున్నాయని తప్పుబట్టారు. అగ్నిపథ్‌ ద్వారా త్రివిధ దళాల్లో సైన్యం బలగాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి ఆర్మీ(Army)లో రిక్రూట్‌మెంట్స్‌ను 60 వేల నుంచి 40 వేలకు తగ్గించారని విమర్శించారు. అగ్నిపథ్‌ (Agnipath) ద్వారా ఆర్మీలో 40 వేలు, నేవీలో 3 వేలు, ఎయిర్‌ఫోర్స్‌లో 3 వేల పోస్టులు ఇస్తున్నారని తెలిపారు. ఆర్మీ స్కిల్స్ చంపేసేలా అగ్నిపథ్ పథకం ఉందని దుయ్యబట్టారు. కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. నిరుద్యోగం పెరగడం వల్లే అగ్నిపథ్ స్కిమ్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారని తెలిపారు. నాణ్యతా శిక్షణలో రాజీపడొద్దన్నారు. పాత విధానంలోనే సైనిక రిక్రూట్‌మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలిసారి ఒకే సమయంలో చైనా, పాక్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని, చైనా సరిహద్దు చర్యలను మోదీ పట్టించుకోకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి మండిపడ్డారు.  

Updated Date - 2022-07-23T22:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising