ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సభ హైదరాబాద్‌లోనే ఎందుకు?: Revanth Reddy

ABN, First Publish Date - 2022-07-01T01:21:58+05:30

ప్రధాని మోదీ (Prime Minister Modi) సభ భాగ్యనగరంలోనే ఎందుకు పెట్టారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (Hyderabad): ప్రధాని మోదీ (Prime Minister Modi) సభ భాగ్యనగరంలోనే ఎందుకు పెట్టారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanthreddy) అన్నారు. ఏపీ (Ap)లో పార్టీ చచ్చినా కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణ (Telangana) ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ వ్యంగ్యంగా మాట్లాడారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను గుర్తించడానికి కూడా మోదీ ముందుకురాలేదన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెప్పారు. నిధుల కేటాయింపు, పదవుల్లో దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు.


‘‘తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. టీఆర్‌ఎస్ (Trs), బీజేపీ చిల్లరగా ఫ్లెక్సీల రాజకీయం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయని మోదీ, బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి. విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టాలి. అగ్నిపథ్‌పై టీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం చేయాలి. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా (Yaswanth Sinha)ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా లేదు. కేసీఆర్‌ను కలిసినవాళ్లను మేం కలవం. యశ్వంత్‌ సిన్హా  కాంగ్రెస్ అభ్యర్థి కాదు.. టీఎంసీ అభ్యర్థి.’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-07-01T01:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising