ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానిపై నోరు పారేసుకోవడం దుర్మార్గం: ఈటల

ABN, First Publish Date - 2022-02-15T01:16:32+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు పారేసుకోవడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు పారేసుకోవడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కేసీఆర్‌ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించని తెలంగాణ సమాజం.. ఇప్పుడు కేసీఆర్‌ను చూసి ‘ఛీ’ కొడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఈటెల మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌ ప్రజల తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ తిరిగిపోయిందన్నారు. హుజురాబాద్‌లో రూ.600కోట్లు ఖర్చు చేసినా.. ప్రజా తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని తెలిపారు. తన గెలుపుతో 12 వేల పల్లెల్లో సంబురాలు జరిగాయంటే కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనలో ఉండడం సరికాదన్నారు. మద్యం విక్రయించడంతో వచ్చిన ఆదాయంతోనే రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నారే తప్పా.. కేసీఆర్‌ ఆస్తులు అమ్మి ఇవ్వడం లేదని ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-02-15T01:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising