ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహేశ్‌ భగవత్‌కు రాష్ట్రపతి మెడల్‌

ABN, First Publish Date - 2022-08-15T09:40:02+05:30

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 14 మంది పోలీసులను కేంద్ర హోంశాఖ ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌(పీపీఎం), ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌(ఐపీఎం) పతకాలతో సత్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ దేవేందర్‌కు కూడా

12 మంది పోలీసులకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్స్‌

హైదరాబాద్‌/కుషాయిగూడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 14 మంది పోలీసులను కేంద్ర హోంశాఖ ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌(పీపీఎం), ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌(ఐపీఎం) పతకాలతో సత్కరించింది. మెడల్స్‌ పొందినవారి జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం సీఐ దేవేందర్‌కు ప్రెసిడెంట్‌ మెడల్స్‌ వచ్చాయి. ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు..


హైదరాబాద్‌ క్రైమ్స్‌ ఏసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగం ఏఎస్పీ సత్యనారాయణ, ఎస్‌ఐబీ ఏఎస్పీ పైళ్ల శ్రీనివాస్‌, సెంట్రల్‌ జోన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఇల్లెందు డీఎస్పీ సుర్రాడ వెంకట రమణమూర్తి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, టీఎస్‌ సివిల్‌ పోలీస్‌ అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం ఎస్‌ఐ చిప్ప రాజమౌళి, చౌటుప్పల్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎ్‌సఐ కాట్రగడ్డ శ్రీనివాసు, కామారెడ్డి అసిస్టెంట్‌ రిజర్వ్‌ ఎస్‌ఐ జంగన్నగారి నీలం రెడ్డి, వరంగల్‌ అసిస్టెంట్‌ రిజర్వ్‌ ఎస్‌ఐ సులేంద్ర సుధాకర్‌, కరీంనగర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం హెడ్‌ కానిస్టేబుల్‌ ఉందింటి శ్రీనివా్‌సను ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీసు విభాగానికి లేఖ రాసింది. అగ్నిమాపక విభాగంలో యర్రగుంట వెంకటేశ్వరరావు(లీడింగ్‌ ఫైర్‌మెన్‌), ఫరీద్‌ షేక్‌(లీడింగ్‌ ఫైర్‌మెన్‌)కు,  హోంగార్డుల విభాగంలో చల్లా అశోక్‌ రెడ్డి, చాందా సురేష్‌, అబ్దుల్‌ షుకూర్‌ బేగ్‌కు పథకాలు లభించాయి. చర్లపల్లి కేంద్ర కారాగారం చీఫ్‌ హెడ్‌ వార్డర్‌ జె.వీరాస్వామి, హెడ్‌వార్డర్‌ వలదాసు జోసెఫ్‌ రాష్ట్రపతి కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు


దక్షిణ మఽధ్య రైల్వేలో ముగ్గురికి పోలీస్‌ మెడల్‌

దక్షిణ మధ్య రైల్వేలో ఆర్పీఎ్‌ఫకు చెందిన ముగ్గురు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ డివిజన్‌ మహబూబ్‌నగర్‌లో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా సేవలందిస్తున్న సైదా తహసీన్‌, మౌలాలీలోని ఆర్పీఎఫ్‌ శిక్షణా కేంద్రంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న నాటకం సుబ్బారావు, అక్కడే హెడ్‌ కానిేస్టబుల్‌గా పని చేస్తున్న బండి విజయ సారథి పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. 

Updated Date - 2022-08-15T09:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising