ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత తపాలా శాఖలో ఏజెంట్ల నియామకం

ABN, First Publish Date - 2022-06-29T23:49:45+05:30

భారతీయ తపాలా శాఖ కమిషన్ ఆధారంగా తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించడానికి ఏజెంట్లను నియమిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారతీయ తపాలా శాఖ కమిషన్ ఆధారంగా తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించడానికి ఏజెంట్లను నియమిస్తోంది. 10వ తరగతి పాస్ అయి, 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత బీమా సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది.


ఆసక్తి కలిగినవారు తమ దరఖాస్తులను గాంధీనగర్ లోని సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ కార్యాలయానికి జులై 15వ తేదీ లోపు తమ దరఖాస్తులను పంపాలని కోరారు. ఎంపిక అయిన అభ్యర్థులు జులై 20వ తేదీన ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కె. సంతోష్ నేత ఒక ప్రకటనలో తెలిపారు.ఏజెంటుగా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్ 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలో ఉన్న తపాలా కార్యాలయం లేదా సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-29T23:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising