కేసీఆర్‌కు ప్రైవేట్ సైన్యంలా పోలీసులు: మల్లు
ABN, First Publish Date - 2022-12-16T03:31:50+05:30
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసులు ప్రయివేట్ సైన్యంలా పనిచేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టబద్ధమైన
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసులు ప్రయివేట్ సైన్యంలా పనిచేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన సాగడంలేదని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేరలేదని, అందుకే బీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేసి పార్టీ స్ట్రాటజీని అపహరించారని, విలువైన సమాచారాన్ని ఎత్తుకెళ్లారని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఈనెల 17న విచారణకు రాలేమని సమాచారం అందించామని, ముందుగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరినట్టు ఆయన తెలిపారు.
Updated Date - 2022-12-16T03:31:51+05:30 IST