ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎంసీకి సహకరించండి ప్లీజ్‌!

ABN, First Publish Date - 2022-08-04T09:45:17+05:30

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో ఏ సమయంలో విద్యుదుత్పత్తి చేయాలి? ఆయా జలాశయాల్లో నీటినిల్వలు ఏ సమయాల్లో ఏ విధంగా ఉండాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో ఏ సమయంలో విద్యుదుత్పత్తి చేయాలి? ఆయా జలాశయాల్లో నీటినిల్వలు ఏ సమయాల్లో ఏ విధంగా ఉండాలి (రూల్‌కర్వ్‌)? మిగులు జలాల గుర్తింపునకు ప్రామాణికం ఏమిటి? వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ)కి పూర్తి సహకారం అందించాలని తెలంగాణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) విజ్ఞప్తి చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఆర్‌ఎంసీ నాలుగో సమావేశం ఉంటుందని కేఆర్‌ఎంబీ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రూల్‌కర్వ్‌ ముసాయిదాపై తెలంగాణ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. ఏ పత్రాలను ప్రామాణికం చేసుకొని ఈ ముసాయిదాను సిద్ధం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తూ ఇప్పటికే లేఖలు రాసింది. ఈ క్రమంలోనే కేఆర్‌ఎంబీ స్పందించిం ది. కృష్ణాబోర్డులోని సభ్యులందరీ అంగీకారంతో ఆర్‌ఎంసీ ఏర్పడిందని, ఈ కమిటీకి జలవిద్యుదుత్పత్తి, శ్రీశైలం, సాగర్‌ రూల్‌కర్వ్‌, మిగులు జలాల గుర్తింపు అంశాలపై తెలుగు రా ష్ట్రాల మధ్య  సమస్యలు నెలకొంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని బోర్డు గుర్తు చేసింది. ఈ మేరకు  తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌)కి బుధవారం బోర్డు లేఖ రాసింది. అయితే గురువారం సమావేశంలో విద్యుదుత్పత్తి, రూల్‌కర్వ్‌, మిగులు జలాల రూపంలో మూడు అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తేలకుంటే సమావేశాన్ని శుక్రవారం కూడా కొనసాగించే అవకాశం ఉందని బోర్డు ఇదివరకే సమాచారం ఇచ్చింది. తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను  నాలుగో సమావేశంలోపే తేల్చాలని స్పష్టం చేస్తూ తెలంగాణ బుధవారం ఈఎన్‌సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాసింది. ఇక వరదల సమయంలో మళ్లించే నీటిని లెక్కకట్టరాదనే ఏపీ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని ఈ లే ఖలో స్పష్టం చేసింది. అయితే తెలంగాణ అధికారులు హాజరు అవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.  


Updated Date - 2022-08-04T09:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising