ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం : Gangulaపై కేంద్ర మంత్రి Piyush ఫైర్

ABN, First Publish Date - 2022-07-06T17:32:30+05:30

తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రులపై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్(Piyush Goyal) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

New Delhi : తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రులపై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్(Piyush Goyal) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీ(Delhi)లో జరిగిన రాష్ట్రాల ఆహార శాఖ మంత్రుల సమావేశం జరిగింది. దేశంలో పౌష్టికాహార భద్రతపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ(Telangana) ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) సహా ఢిల్లీ(Delhi), పశ్చిమబెంగాల్(West Bengal) మంత్రులు గైర్హాజరు అయ్యారు. ముఖ్యమైన సదస్సుకు సంబంధిత రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడంపై పీయుష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరుకాని మంత్రుల వివరాలను నోట్ చేసుకున్నానని సంబంధిత మంత్రులకు తెలియజేయాలని సదస్సుకు హాజరైన ఆయా రాష్ట్రాల అధికారులకు పీయుష్ గోయల్ తెలిపారు. సదస్సుకు రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడమనేది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇకపై గైర్హాజరైన మంత్రులకు ఏదైనా సమస్య వచ్చినా లేదా తనని కలవాలనుకున్నా తనకు కూడా సమయం ఉండదని తెలిపారు. కేంద్రం, తెలంగాణ మధ్య ఇప్పటికే ధాన్యం సేకరణపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Updated Date - 2022-07-06T17:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising