ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింగళి వెంకయ్య తెలుగుజాతికి గర్వకారణం

ABN, First Publish Date - 2022-08-04T09:43:50+05:30

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పింగళి వారసులను సత్కరించిన ఉపరాష్ట్రపతి 
  • జాతీయజెండా ఉన్నంత వరకు స్మరించుకుంటారు : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం తనను కలిసిన పింగళి వారసులు, మనుమరాలు సుశీల, ఆమె కుమారుడు పింగళి వెంకయ్య (మునిమనుమడు), మనుమలు ఘంటశాల గోపీకృష్ణ, వాసుదేవ నరసింహం, కృష్ణప్రవీణ్‌ను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జీవితం ఆదర్శనీయమని తెలిపారు. పింగళి కార్యదీక్ష, దేశభక్తిని యువ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి కూడా పింగళి వారసులను సత్కరించారు. జాతీయ జెండా ఉన్నంత వరకు పింగళి వెంకయ్యను దేశ ప్రజలను స్మరించుకుంటారని కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ అమృత మహోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పింగళి సొంతూరుకు వెళ్లానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను త్వరలో కాలినడకన సందర్శిస్తానని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కాగా, పింగళి వెంకయ్యతో తన అనుబంధాన్ని పుస్తక రూపకంగా తీసుకొచ్చిన మనుమడు జీ వాసుదేవ నరసింహం దానిని కిషన్‌రెడ్డికి  బహూకరించారు. గతంలో ఏ ప్రభుత్వమూ పింగళిని పట్టించుకోలేదని, మోదీ ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-04T09:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising