ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో రైతు ప్రోత్సాహక బకాయిలు చెల్లింపు

ABN, First Publish Date - 2022-01-24T09:01:34+05:30

విజయ డెయిరీ పాడి రైతులకు 2021 డిసెంబరు వరకు చెల్లించాల్సిన లీటరుకు రూ.4ల ప్రోత్సాహక బకాయి డబ్బు రూ.50 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలో వాటిని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (టీఎ్‌సడీడీసీఎఫ్‌) చైర్మన్‌ లోక భూమారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ పాడి రైతులకు 2021 డిసెంబరు వరకు చెల్లించాల్సిన లీటరుకు రూ.4ల ప్రోత్సాహక బకాయి డబ్బు రూ.50 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలో వాటిని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (టీఎ్‌సడీడీసీఎఫ్‌) చైర్మన్‌ లోక భూమారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాలలోని పాల శీతలీకరణ కేంద్రం ఎదుట రూ.46 లక్షలతో నిర్మించే దుకాణ సముదాయానికి  ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. సమైక్య రాష్ట్రంలో నష్టాల్లో కూరుకుపోయిన సమాఖ్య సీఎం కేసీఆర్‌ చేయూత, కృషిమూలంగా రూ.30 కోట్ల నష్టాన్ని పూడ్చుకుని, ప్రస్తుతం రూ.61 కోట్ల లాభాల్లో కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.710 కోట్ల టర్నోవర్‌ను మార్చి నాటికి రూ.750 కోట్లకు చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. రావిరాల సమీపంలో రూ.246 కోట్లతో 8 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మెగా డెయిరీ నిర్మాణాన్ని వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.  కాగా, పాడి రైతులకు ప్రోత్సాహక డబ్బు వెంటనే చెల్లించాలని, డీడీలు కట్టిన రైతులకు ఆవులను అందించాలని, పాల ధర లీటర్‌కు రూ.5 పెంచాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు భూమారెడ్డికి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-01-24T09:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising