ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించాలి

ABN, First Publish Date - 2022-12-07T23:59:01+05:30

బహిరంగ మార్కెట్‌ ధర ప్రకా రం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించేవరకూ దీక్షలు కొనసాగిస్తామని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డికి నిర్వాసితులు తేల్చిచెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులు బుధవారం పనులను అడ్డుకొని వంటావార్పుతో రిజర్వార్‌ వద్ద తొమ్మిదో రోజు దీక్షలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌, ఆర్డీవోలతో ముంపు నిర్వాసితుల డిమాండ్‌

భువనగిరి రూరల్‌, డిసెంబరు 7: బహిరంగ మార్కెట్‌ ధర ప్రకా రం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించేవరకూ దీక్షలు కొనసాగిస్తామని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డికి నిర్వాసితులు తేల్చిచెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులు బుధవారం పనులను అడ్డుకొని వంటావార్పుతో రిజర్వార్‌ వద్ద తొమ్మిదో రోజు దీక్షలు చేపట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పమేలాసత్పథితో సమావేశ మై ముంపు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాసం కల్పనపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా పునరావాసం కోసం చేపడుతున్న పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన నిధులను డిసెంబరు చివరి నాటికి అందజేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేకు కలెక్టర్‌ వివరించారు. ఈ విషయంపై అదనపు కలెక్టర్‌, ఆర్డీవో దీక్ష శిబిరానికి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడారు. రిజర్వార్‌ నిర్మాణం పనులు కొనసాగేలా సహకరించాలన్నారు. అయితే పరిహారం ఇచ్చేవరకూ దీక్షలు కొనసాగిస్తామని భీష్మించుకూర్చున్నారు. దీంతో చేసేది ఏమిలేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ కుర్షిద్‌, సర్పంచ్‌ పిన్నెం లతరాజు, ఎంపీటీసీ శారద పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising