కన్నులపండువగా ‘పంబ ఆరట్టు’
ABN, First Publish Date - 2022-12-22T00:35:25+05:30
జిల్లాకేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాయలయంలో పంబ ఆరట్టు ఉత్సవం కన్నుల పండువగా కొనసాగింది. బుధవారం ఉదయం ఆలయంలో వెంకటేశ్వర శ ర్మ, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్‌శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచి గణపతి హోమం, అష్టాదశ కలశపూజ, మూలవిరాట్ అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. 10 గంటలకు అయ్యప్ప దేవాలయం నుంచి దేవత ఉత్సవమూర్తులతో ఊరేగించారు.
యాదాద్రి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాయలయంలో పంబ ఆరట్టు ఉత్సవం కన్నుల పండువగా కొనసాగింది. బుధవారం ఉదయం ఆలయంలో వెంకటేశ్వర శ ర్మ, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్‌శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచి గణపతి హోమం, అష్టాదశ కలశపూజ, మూలవిరాట్ అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. 10 గంటలకు అయ్యప్ప దేవాలయం నుంచి దేవత ఉత్సవమూర్తులతో ఊరేగించారు. ఈ ఊరేగింపును భువనగిరి మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ప్రారంభించారు. అంబారి ఏనుగు ఊరేగింపు శ్రీలక్ష్మీనారాయణ దేవాలయంనుంచి బయలుదేరి... భువనగిరి ప్రధాన రహదారిలోని వినాయక చౌరస్తా, ఆజాద్‌రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా సాగింది. పురవీధులగుండా కోలాట బృందాలతో అత్యంత వైభవంగా కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం భువనగిరి పెద్దచెరువులో కండ అభిషేకాలు నిర్వహించారు. అంబారీ ఏనుగు దాతగా గూడూరు నారాయణరెడ్డి ఉండగా, భక్తులకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు అభిషేక్, చెన్న మహేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బెలిదె వెంకటేష్, అధ్యక్షుడు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిడ్డి సత్యం, కోశాధికారి శ్యాంసుందర్, మాజీ చైర్మన్ అనంతరాములు, మంచాల ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-22T00:35:29+05:30 IST