ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకోటి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే:మంత్రులు

ABN, First Publish Date - 2022-08-31T09:32:46+05:30

ఇది వరకే 40 లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, కొత్తగా మరో 10 లక్షల మందికి మంజూరుతో అరకోటి మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌, వేల్పూర్‌, తాండూరు, ఆగస్టు 30 : ఇది వరకే 40 లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, కొత్తగా మరో 10 లక్షల మందికి మంజూరుతో అరకోటి మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పలు జిల్లాల్లో కొత్తగా మంజూరైన పెన్షన్‌ల మంజూరు పత్రాలను మంత్రులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని అన్నారు.  నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పింఛన్లు పంపిణీ చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని అన్నారు.  రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్షగా నిలుస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పెన్షన్ల పంపిణీ అనంతరం ఆమె మాట్లాడారు.

Updated Date - 2022-08-31T09:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising