ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-24T09:04:47+05:30

తమది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తమది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌ సంఘం-2022 డైరీని హరీశ్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. విద్యకు కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. రూ.7,289 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, సంఘం ప్రతినిధి కృష్ణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


25 నుంచి ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలు

సర్కారీ దవాఖానాల ఆకస్మిక తనిఖీలకు మంత్రి హరీశ్‌  సిద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి తనిఖీలు చేపట్టబోతున్నారు. ప్రతీ వారం రెండు జిల్లా ఆస్పత్రులతో పాటు వైద్య విద్య కళాశాలలను తనిఖీ చేస్తారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల్లో లోపాలపై దృష్టిసారిస్తారు. వెళ్లిన ప్రతీచోట మంత్రి సమీక్ష నిర్వహిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. అయితే ఏ రోజు ఏ జిల్లాకు వెళ్తారన్నది చివరి నిమిషం వరకు తెలియనివ్వరు.

Updated Date - 2022-01-24T09:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising