ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యుల పరిశోధనకు జాతీయ పురస్కారం

ABN, First Publish Date - 2022-01-24T09:00:53+05:30

కరెంట్‌ షాక్‌ కారణంగా అయ్యే గాయలకు వీలైనంత త్వరగా మెరుగైన శస్త్ర చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు 50 శాతం పెరుగుతాయని నిరూపించిన ఉస్మానియా వైద్య బృందానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్న్‌ కాంగ్రెస్‌కు డాక్టర్‌ విజయబాబు  పరిశోధన పత్రం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): కరెంట్‌ షాక్‌ కారణంగా అయ్యే గాయలకు వీలైనంత త్వరగా మెరుగైన శస్త్ర చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు 50 శాతం పెరుగుతాయని నిరూపించిన ఉస్మానియా వైద్య బృందానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కరెంట్‌ షాక్‌తో కాలిన గాయాల పాలైన రోగులపై ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్‌ పలుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు రెండేళ్ల పాటు పరిశోధనలు చేసి దీనిని నిరూపించారు. సాధారణంగా కాలిన గాయాల కంటే కరెంట్‌ షాక్‌తో కలిగే గాయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్ర కరెంట్‌ షాక్‌కు గురైన వారు ప్రాణాలు లేదా అవయవాలు కోల్పోతారు. ఇలాంటి తీవ్రమైన గాయాలకు వీలైనంత త్వరగా మెరుగైన శస్త్ర చికిత్స అందించడం ద్వారా అవయవాలు కోల్పోకుండా 50ు వరకు కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యుల బృందం నిరూపించారని లక్ష్మి వివరించారు. ఈ పరిశోధన పత్రాన్ని జాతీయ స్థాయిలో ముంబైలో జనవరి 22న జరిగిన బర్న్‌ కాంగ్రెస్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ పీజీ వైద్యుడు డాక్టర్‌ విజయబాబు ప్రెజెంట్‌ చేశారు. జాతీయ అవార్డు సాధించిన విజయ్‌బాబు.. ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి గర్వకారణమని ఆమె అన్నారు.  

Updated Date - 2022-01-24T09:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising