ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొవిడ్‌ పరిహారానికి 35,846 దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-06-25T08:49:02+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలపై సర్కారు చెబుతున్న లెక్కలకు, ఇచ్చిన నష్టపరిహారానికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. ఇప్పటికీ అధికారికంగా కొవిడ్‌తో 4,111 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

32,057 దరఖాస్తులకు ఆమోదం

26,870 కుటుంబాలకు పరిహారం పంపిణీ 

2,603 దరఖాస్తుల తిరస్కరణ 

నష్టపరిహారం కోసం భారీగా దరఖాస్తులు


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలపై సర్కారు చెబుతున్న లెక్కలకు, ఇచ్చిన నష్టపరిహారానికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. ఇప్పటికీ అధికారికంగా కొవిడ్‌తో 4,111 మంది చనిపోయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ మరణాలకు నష్టపరిహారం కోరుతూ మృతుల కుటుంబాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని జిల్లాల నుంచి 35,846 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32,057 దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో 26,870 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం కూడా చెల్లించినట్లు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 5,187 కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు.


కాగా కొవిడ్‌ పాజిటివ్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, డెత్‌ సర్టిఫికెట్‌లో కొవిడ్‌తో మృతి అని లేకపోవడంవంటి కారణాలతో 2,603 దరఖాస్తులను తిరస్కరించారు. సరైన ధ్రువ పత్రాలతో మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కొన్ని దరఖాస్తులు ప్రాసె్‌సలో ఉన్నాయి. నష్ట పరిహారం కోరుతూ మృతుల కుటుంబాల నుంచి ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-25T08:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising