ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్ ఘటనకు NSUIకి సంబంధం లేదు: బలమూర్ వెంకట్

ABN, First Publish Date - 2022-06-17T16:02:34+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండతో ఎన్‌ఎస్‌యూఐ (NSUI)కి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూర్ వెంకట్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండతో ఎన్‌ఎస్‌యూఐ (NSUI)కి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూర్ వెంకట్ (Balamoor Venkat) స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. అది అగ్నిపత్ వ్యతిరేక యువకుల పనిగా తెలుస్తోందని అన్నారు. ఆర్మీ పరీక్ష రద్దు చేసిన కారణంగా 44 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బాధ, ఆవేదనతో పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు ఆ పని చేశారన్నారు. దీన్ని ఎన్‌ఎస్‌యూఐకి ఆపాదించడం సరికాదన్నారు. ‘‘నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి షాయినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు’’ అని బలమూర్ వెంకట్ తెలియజేశారు.


మరోవైపు... అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు. బస్సులపై రాళ్లు రువ్వారు. స్టేషన్‌లో హౌరా ఎక్స్ ప్రెస్‌ రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థుల విధ్వంసంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. 

Updated Date - 2022-06-17T16:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising