ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లాండ్‌ నుంచి వచ్చాడు.. దుర్మరణం పాలయ్యాడు

ABN, First Publish Date - 2022-01-13T05:49:05+05:30

ఇంగ్లాండ్‌ నుంచి వచ్చాడు.. దుర్మరణం పాలయ్యాడు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాదంలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ మృతి

ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

ఏటూరునాగారం, జనవరి 12: ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి స్వగ్రామం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి తండ్రి వద్దకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన రెడ్డి హోటల్‌ యజమాని మలెపాటి విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి అలియాస్‌ సాయి (35) కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా ఇంగ్లాండ్‌లో ఉంటున్నాడు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. మూడేళ్ల క్రితం తల్లి పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. పది రోజుల క్రితమే ఇంగ్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సాయి తండ్రిని చూడ్డానికి ఏటూరునాగారం వచ్చాడు. మూడు రోజులు ఉండి తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. కాసేపట్లో చేరుకోనున్న క్రమంలో బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో ఏటూరునాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న విజయభాస్కర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. వద్దన్నా బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరాడని, ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సిన కొడుకు కానరాని లోకాలకు చేరాడని కన్నీరుమున్నీరయ్యాడు.


Updated Date - 2022-01-13T05:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising