ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు

ABN, First Publish Date - 2022-10-11T09:07:19+05:30

పార్టీ నియమావళిని తానెప్పుడూ ఉల్లంఘించలేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీకి నివేదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమర్శించింది మజ్లిస్‌నే.. ముస్లింలను కాదు: రాజాసింగ్‌ వివరణ

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పార్టీ నియమావళిని తానెప్పుడూ ఉల్లంఘించలేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గత ఆగ స్టు 23న రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన అగ్రనాయకత్వం.. ఎందుకు బహిష్కరించకూడదో పదిరోజుల్లో తెలపాలంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పీడీయాక్టు నమోదు చేయించడంతో తన భర్త జైల్లో ఉన్నారని, షోకాజ్‌ నోటీసుపై వివరణ ఇచ్చేందు కు గడువు ఇవ్వాలని బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీని రాజాసింగ్‌ సతీమణి ఉషారాణి అభ్యర్థించారు. ఈ మేరకు తాజాగా సోమవారం క్రమశిక్షణ కమిటీకి ఆయన వివరణ లేఖ పంపారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేయబోనని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని పేర్కొంటూ.. కార్యకర్తగా కొనసాగే అ వకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ‘‘టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ దురాగతాలపై పోరాటం చేస్తున్న హిందువులను రెచ్చగొట్టేందుకే మునావర్‌ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆయన హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఆయన వ్యాఖ్యలను అనుకరణ చేశానే తప్ప, ఏ మతాన్నీ కిం చపరచలేదు. నేను మజ్లిస్‌ను విమర్శించిన ప్రతి సారీ.. ముస్లింలను విమర్శించినట్లు చిత్రీకరిస్తున్నారు. నేనెప్పుడూ ముస్లింలను విమర్శించలేదు’’ అని వివరించారు.  

Updated Date - 2022-10-11T09:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising