ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది ఫైర్‌ ఎన్‌ఓసీ అవసరం లేదు

ABN, First Publish Date - 2022-03-16T09:28:52+05:30

ఇంటర్మీడియట్‌ కాలేజీలు అగ్నిమాపక శాఖ నుంచి ‘నిరభ్యంతర పత్రాల(ఎన్‌ఓసీ)’ను పొందాలన్న నిబంధనలను ఈ ఏడాదికి మినహాయిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌ కాలేజీలకు బోర్డు సూచన

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ కాలేజీలు అగ్నిమాపక శాఖ నుంచి ‘నిరభ్యంతర పత్రాల(ఎన్‌ఓసీ)’ను పొందాలన్న నిబంధనలను ఈ ఏడాదికి మినహాయిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది (2022-23) మాత్రం కచ్చితంగా అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి మంగళవారం ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేశారు. 


ఇంటర్‌ కన్నా ముందే ‘పది’ పరీక్షలు నిర్వహించాలి: యూటీఎఫ్‌

జేఈఈ మెయిన్‌ పరీక్షల రీషెడ్యూల్‌ దృష్ట్యా ఒకవేళ ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమైతే ఇంటర్‌ కన్నా ముందుగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) కోరింది. ఈ మేరకు యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్వి చావ రవి మంగళవారం విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌లకు విజ్ఞప్తి చేశారు. 


31న డీఎస్‌ఈ ముట్టడిస్తాం: ఎస్టీయూ

బదిలీల్లో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 31న పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ కార్యాలయం(డీఎ్‌సఈ) ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్‌, పర్వత్‌రెడ్డి ప్రకటన చేశారు. 


కాంపిటెంట్‌ అథారిటీ కోటాలో..

పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

హనుమకొండ అర్బన్‌, మార్చి 15: పీజీ నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతోపాటు హైదరాబాద్‌ నిమ్స్‌ కళాశాలలో కాంపిటెంట్‌ అథారిటీ కోటా పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తగ్గిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా.. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 16, 17, 18 తేదీల్లో knruhs.telanga na.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.


Updated Date - 2022-03-16T09:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising