ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వరకు సీట్ల కేటాయింపులు వద్దు

ABN, First Publish Date - 2022-10-07T08:12:12+05:30

నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులను ఈ నెల 10 వరకు చేపట్టవద్దని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటాపై హైకోర్టు ఆదేశం
  • ఇన్‌సర్వీ్‌స కోటా అమలుపై విచారణ 
  • వైద్యవిధాన పరిషత్‌ను తప్పుపట్టిన ధర్మాసనం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులను ఈ నెల 10 వరకు చేపట్టవద్దని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు ప్రక్రియను నిలుపుదల చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇన్‌సర్వీస్‌ కోటా వర్తిస్తుంది. తమకు ఇన్‌సర్వీస్‌ కోటా ఉన్నప్పటికీ వర్తింపచేయడం లేదని నల్గొండ జిల్లా పంతంగికి చెందిన డాక్టర్‌ దిండు మల్లికార్జున్‌, మరో ముగ్గురు అభ్యర్థులు హైకోర్టులో గురువారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కౌన్సెలింగ్‌ సందర్భంగా ఇన్‌సర్వీస్‌ సర్టిఫికెట్లను ఇచ్చినా.. వర్సిటీ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. గురువారం ఉదయంతో వెబ్‌ ఆప్షన్లు ముగిసినందున.. తమకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ సీహెచ్‌ సుమలతలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సర్వీ్‌స కోటాను సరిగా అమలుచేయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇచ్చి.. తర్వాత అవి చెల్లవని చెప్పడంతో పిటిషనర్ల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వైద్య విధాన పరిషత్‌ తీరును తప్పుబట్టింది. సీట్ల కేటాయింపు చేపట్టవద్దని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ యూనివర్సిటీని ఆదేశించింది.


Updated Date - 2022-10-07T08:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising