ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-10-08T04:30:43+05:30

తెలంగాణలో ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేపడుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాదయాత్ర చేపడుతూ ప్రజల్లోకి వెళుతోంది.

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యవతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేడు కామారెడ్డిలోకి ప్రవేశించనున్న షర్మిల పాదయాత్ర
- ఇందిరాచౌక్‌ వద్ద భారీ బహిరంగసభ
- అక్కడి నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న పాదయాత్ర
- ఉమ్మడి జిల్లాలో సుమారు 10 రోజుల పాటు కొనసాగనుంది

కామారెడ్డి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేపడుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాదయాత్ర చేపడుతూ ప్రజల్లోకి వెళుతోంది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో షర్మిల పాదయాత్ర చేపడుతున్నారు. శనివారం ఈ పాదయాత్ర కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులో జిల్లా వైఎస్‌ఆర్‌టీపీ నేతలు షర్మిల పాదయాత్రకు ఘన స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సభ అనంతరం షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
ఉమ్మడి జిల్లాలో పది రోజుల పాటు సాగనున్న పాదయాత్ర
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో షర్మిల కార్యక్రమాలు జరగనున్నాయి. బాన్సువాడ నుంచి కోటగిరిలోకి పాదయాత్ర చేరనుంది. ప్రతీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాదయాత్ర కొనసాగే రూట్‌ వెంట అన్ని గ్రామాలను సందర్శించనున్నారు. ప్రతీరోజు 20 నుంచి 22 కి.మీల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఆ పార్టీ ప్రతినిధులు ప్రకటించారు.
పాదయాత్ర రూట్‌ మ్యాప్‌
కామారెడ్డి పట్టణానికి శనివారం షర్మిల పాదయాత్ర చేరుకోనుంది. ఇందిరాచౌక్‌లో భారీ బహిరంగ సభ తర్వాత దేవునిపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగి లింగాపూర్‌లో బస చేయనున్నారు. మరుసటి రోజు 9వ తేదీన తాడ్వాయిలోని కృష్ణాజీవాడి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. బ్రహ్మజీవాడి, దేవాయిపల్లి, తాడ్వాయి, ఎండ్రియాల్‌, ఎర్రాపహాడ్‌ గ్రామాల నుంచి లింగంపేట మండలంలోని మోతే గ్రామం మీదుగా గాంధీనగర్‌, ఎల్లారం, కోయగుట్ట తండా, వంటేరుపల్లి వరకు సాగి అక్కడే బస చేయనున్నారు. మరుసటిరోజు 10వ తేదీన లింగంపేట నుంచి శెట్పల్లి, మెగారం, కొటాల్‌, లక్ష్మాపూర్‌ నుంచి ఎల్లారెడ్డి మండలంలోకి హాజీపూర్‌ తండాలోకి ప్రవేశించనుంది. గండిమాసానిపేట, పోసానిపల్లి, తిమ్మాపూర్‌ నుంచి ఎల్లారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 11వ తేదీన నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి తండా, బొగ్గుగుడిసే, నిజాంసాగర్‌ ప్రాజెక్టు కెనాల్‌, సుల్తాన్‌నగర్‌, నిజాంసాగర్‌, మాగి, మంగళూర్‌, పిట్లం వరకు పాదయాత్ర సాగనుంది. 12వ తేదీన పిట్లంలోని నాగంపల్లి, పోతిరెడ్డిపల్లి తండా, జగదాంబ తండా, కిష్టాపూర్‌, అన్నారంగేట్‌, బ్రాహ్మణ్‌పల్లి, సిద్దాపూర్‌ తండా, చిల్లంగి, సిద్ధాపూర్‌, కుర్తి, గౌరారం తండా, మద్దెల చెరువు, బండేపల్లి నుంచి బిచ్కుందలోని బండరెంజల్‌కు చేరనుంది. 13వ తేదీన బిచ్కుందలోనే గుండెనెమలి, వాజీద్‌నగర్‌, పుల్కల్‌, పెద్దదేవాడ, చిన్నదేవాడ, గోపాన్‌పల్లి, బిచ్కుంద మండల కేంద్రానికి చేరుకుని బహిరంగ సభను చేపట్టనున్నారు. బిచ్కుంద నుంచి బాన్సువాడ నుంచి నిజామాబాద్‌ జిల్లాకు పాదయాత్ర చేరుకోనుంది. నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి, రుద్రూర్‌, బోధన్‌, మోస్రా మండలం మీదుగా నిజామాబాద్‌ నగరం వరకు షర్మిల పాదయాత్ర సాగనుంది.

అమరుల త్యాగాలతో సీఎం కేసీఆర్‌ గద్దెనెక్కారు

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 7: అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ గద్దెనెక్కి కూర్చున్నారని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యవతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకు మాత్రం చెక్కులను అందించడం శోచనీయమని అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనను, లోపాలను, ప్రజల సమస్యలను వెలికితీస్తూ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 173 రోజులు పూర్తి చేసుకుందన్నారు. శనివారం కామారెడ్డికి షర్మిల పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి పాదయాత్ర చేరుకుని ఐదు రోజుల పాటు కొనసాగనుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాచౌక్‌ వద్ద పాదయాత్ర అనంతరం పెద్ద ఎత్తున సభ నిర్వహించి నిజాంసాగర్‌ చౌరస్తా మీదుగా లింగాపూర్‌ వరకు సభ కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలపై నుంచి కొనసాగనుందని కావున కార్యకర్తలు, నాయకులు, వైఎస్‌ఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రాము, నిజామాబాద్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మీ, బోధన్‌ అధ్యక్షుడు గౌతమ్‌ ప్రసాద్‌,కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ బూత్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, నాయకులు తాహిర్‌, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising