ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: కొండరాళ్ల కింద యువకుడు విలవిల..

ABN, First Publish Date - 2022-12-15T11:07:36+05:30

కామారెడ్డి: రామారెడ్డి మండలం, సింగరాయిపల్లి అడవిలోని కొండరాళ్ల గుహలో చిక్కుకున్న యువకుడు రాజును కాపాడేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: రామారెడ్డి మండలం, సింగరాయిపల్లి అడవిలోని కొండరాళ్ల గుహలో చిక్కుకున్న యువకుడు రాజును కాపాడేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

బుధవారం సాయంత్రం నుంచి యువకుడిని రక్షించేందుకు రిస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు మంగళవారం సాయంత్రం సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో షికారుకు వెళ్లాడు. ఆ సమయంలో రాళ్లపై నుంచి వెళుతుండగా సెల్ ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యకు జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు.

వేటకు వెళ్లిన కారణంగా కుటుంబసభ్యులు, స్నేహితులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాజును బయటకు తీసేందుకు బుధవారం మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు రిస్క్యూ బృందం, యంత్రాల ద్వారా రాజును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ధైర్యం చెబుతూ నీళ్లు, ఓఆర్ఎస్ తాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దాదాపు 36 గంటలకుపైగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురౌతున్నారు. రెండు రోజులుగా కొండ రాళ్ల మధ్య ఇరుక్కున్న రాజు తనను కాపాడాలంటూ వేడుకుంటున్నాడు. రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Updated Date - 2022-12-15T14:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising