ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనానికి పాల్పడిన మహిళ అరెస్టు

ABN, First Publish Date - 2022-07-06T05:38:15+05:30

ఆరు నెలలుగా ఆర్మూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో వరు సగా 14 దొంగతనాలకు పాల్పడిన బసనబోయిన యాదలక్ష్మి అనే మహిళ ను అరెస్టు చేసి 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీపీ కేఆర్‌ నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం బస్టాండ్‌ ప్రాంతంలో అనుమానితురాలిగా తిరుగుతున్న యాదలక్ష్మి ఇటీవల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలతో గమనించి పట్టుకొని విచారించగా, గత సంవ త్సరం నవంబరు నుంచి బస్సు ఎక్కే ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు ఉండే బ్యాగులను దొంగతనం చేసి కొంత బంగారం నిజామా బాద్‌లోని మణప్పురం, యూకో బ్యాంకులో పెట్టినట్టు విచారణలో తెలింద ని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్మూర్‌టౌన్‌, జూలై5: ఆరు నెలలుగా ఆర్మూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో వరు సగా 14 దొంగతనాలకు పాల్పడిన బసనబోయిన యాదలక్ష్మి అనే మహిళ ను అరెస్టు చేసి 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీపీ కేఆర్‌ నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం బస్టాండ్‌ ప్రాంతంలో అనుమానితురాలిగా తిరుగుతున్న యాదలక్ష్మి ఇటీవల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలతో గమనించి పట్టుకొని విచారించగా, గత సంవ త్సరం నవంబరు నుంచి బస్సు ఎక్కే ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు ఉండే బ్యాగులను దొంగతనం చేసి కొంత బంగారం నిజామా బాద్‌లోని మణప్పురం, యూకో బ్యాంకులో పెట్టినట్టు విచారణలో తెలింద ని తెలిపారు. నిందితురాలు గతంలో నిజామాబాద్‌, రామాయణంపేట్‌లో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఎస్సైలు శ్రీకాంత్‌, ప్రదీప్‌కుమార్‌లు, ఎఎస్సై అబ్దుల్‌గఫార్‌, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు గంగాప్రసాద్‌, లిఖిత, హోంగార్డులను అభినందించారు.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి..

ప్రతీఒక్క ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ నాగరాజు అన్నారు. నిరంతరం నిద్రలేకుండా సీసీ కెమెరాలు పని చేస్తాయ ని, నేరాలు నియంత్రణకు ఉపయోగపడుతుందని తెలిపారు. పట్టణ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు అందిస్తే రశీదును అంద జేస్తామని, రశీదు ఐటీలో చూయించుకోవచ్చని ఆయన తెలిపారు.

Updated Date - 2022-07-06T05:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising