ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో కేంద్ర బృందం సభ్యుల పర్యటన

ABN, First Publish Date - 2022-09-08T06:40:06+05:30

మినిస్టర్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రెటరీ శృతిశరన్‌, డిప్యూటీ సెక్రటరీ నివేదితల బృందం బుధవారం జిల్లాలో పర్యటించారు. వీరికి కలెక్టర్‌లు స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్‌ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూర్బన్‌ పథకం కింద జుక్కల్‌ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

జుక్కల్‌లో ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, సెప్టెంబరు 7: మినిస్టర్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రెటరీ శృతిశరన్‌, డిప్యూటీ సెక్రటరీ నివేదితల బృందం బుధవారం జిల్లాలో పర్యటించారు. వీరికి కలెక్టర్‌లు స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్‌ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూర్బన్‌ పథకం కింద జుక్కల్‌ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రూర్బన్‌ మిషన్‌ పథకం కింద చేపట్టిన పనులు, రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డీఆర్‌డీవో సాయన్న అధికారులు పాల్గొన్నారు.
ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించిన కేంద్ర బృందం
జుక్కల్‌, సెప్టెంబరు 7: మండలంలో ఉపాధి హామీ, రూర్బన్‌ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రెటరీ శృతిశరన్‌, డిప్యూటీ సెక్రెటరీ నివేదితలు బుధవారం పరిశీలించారు. జుక్కల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ, రూర్బన్‌ పథకాల కింద నిర్మించిన 400 మెట్రిక్‌ టన్నుల గోదాంను, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గోదాం నిర్మించడం వల్ల స్థానికంగా కలిగిన ప్రయోజనాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నిర్మించిన గోదాంలో పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు, నీటి తొట్టి వేసవి కాలంలో పశువుల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడుతున్నాయని రైతులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థులకు పౌష్టికాహారం అందేవిధంగా చూడాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. జుక్కల్‌ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ధామాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర బృందం వెంట కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డీఆర్‌డీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-08T06:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising