రెండు కొత్త జాతీయ రహదారులు
ABN, First Publish Date - 2022-12-03T00:26:57+05:30
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు అధి కారులు కసరత్తు చేస్తున్నారు. త్వరగా రోడ్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో కొత్తగా రెండు నేషనల్ హైవేలు
బోధన్-భైంసా జాతీయ రహదారికి పూర్తయిన టెండర్లు
రహదారి కోసం భూసేకరణ చేపట్టిన అధికారులు
టెండర్ దశలో మెదక్ - రుద్రూర్ జాతీయ రహదారి
నిజామాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు అధి కారులు కసరత్తు చేస్తున్నారు. త్వరగా రోడ్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బోధన్, బాసర, భైంసా రోడ్డు టెండర్ ఫైనల్ కాగా భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. మెదక్, రుద్రూర్ రో డ్డు టెండర్ దశలో ఉండగా భూసేకరణ పైన అధికారులు దృష్టిపెట్టారు. ఈ రెండు రహదారులను షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్‌లు పూర్తికాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారుల ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే జాతీయ రహదారి 63 కొనసాగుతోంది. ఈ రహదారి ఉండగానే కొత్తగా రెండు రహదారులను కేంద్ర ప్రభుత్వం మం జూరు చేసింది. జాతీయ రహదారి 161 బీబీ కింద బోధన్, బాసర, భైంసా జాతీయ రహదారి కోసం అనుమతులను మంజూరు చేసింది. ఈ రహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రెండు వరుసల రహదారిని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రహదారి కోసం ఇప్ప టికే టెండర్‌లను పూర్తిచేశారు. బోధన్, బాసర, భైంసా రహదారి కోసం 640.54 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఈ రహదారి టెండర్ పూర్తికావడంతో అవసరమైన భూసేకరణను అధికారులు చేపట్టారు. బోధ న్ నుంచి యంచ వరకు జిల్లా అధికారులు భూసేకరణ చేపట్టగా బాసర నుంచి భైంసా వరకు నిర్మల్ జిల్లా అధికారులు భూసేకరణ చేస్తున్నారు. నెల రోజులలోపు భూసేకరణ పూర్తిచేసి జాతీయ రహదారుల సంస్థకు కావాల్సిన భూములను అందించనున్నారు. భూములను ఇవ్వగానే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమవు తోంది. టెండర్‌లకు అనుగుణంగా రెండేళ్లలోపు పనులు పూర్తిచేసేవిధంగా కాంట్రాక్టర్‌లతో ఒప్పందం చేసుకున్నారు. భూములు కోల్పోయే రైతులకు కూడా నష్టపరిహారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెదక్ నుంచి రుద్రూర్ వరకు..
ఈ రహదారే కాకుండా మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సూవాడ మీదుగా రుద్రూర్ వరకు 765 డీ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ రహదారి కోసం సుమారు రూ.900 కోట్లను వెచ్చించనున్నారు. ఇప్పటికే ఈ జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా టెండర్‌లను పిలిచారు. టెండర్‌లు పూర్తికాగానే భూసేకరణను పూర్తిచేసి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 74 కి.మీల దూరం ఉండే ఈ రోడ్డు కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలో చేపడుతున్న ఈ జాతీయ రహదారి పూర్తయితే మహారాష్ట్ర, కర్నాటకతో మరింత అనుసంధానం పెరగడంతో పాటు భారీ వాహనాలకు ఉపయోగపడనుంది. రవాణాకు కూడా మరింత మెరుగుపడనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఉన్న రెండు జాతీయ రహదారులకు మరో రెండు కొత్త జాతీయ రహదారులు నిర్మాణం పూర్తయితే ఇతర ప్రాం తాలకు వెళ్లేవారికి ఎంతో ఉప యోగపడనుంది. ఈ రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒక రహదారి టెండర్ పూర్తికాగా మరొక రహదారి టెండర్ దశలో ఉందని వారు తెలిపారు. బోధన్, భైంసా రహదారి కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టామని బోధన్ ఆర్‌డీవో రాజేశ్వర్ తెలిపారు. ఈ రోడ్డుకు అవసరమైన భూముల కోసం రైతులతో మాట్లాడుతున్నామని ఆయన తెలిపారు. నెల రోజులలోపు కావాల్సిన భూములను జాతీయ రహదారుల సంస్థకు అందజేస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2022-12-03T00:26:59+05:30 IST