ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో మూడు కొత్త మండలాలు

ABN, First Publish Date - 2022-07-24T05:51:39+05:30

జిల్లాలో మూడు కొత్త మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్మూర్‌ నియోజకవర్గంలో డొంకేశ్వర్‌, ఆలూరు, బోధన్‌ నియోజకవర్గంలో పరిధిలో సాలూర మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్త ర్వులకు అనుగుణంగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొంకేశ్వర్‌, ఆలూరు, సాలూరా ఏర్పాటు కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌

ప్రిలిమినరి డ్రాఫ్ట్‌ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం

నిజామాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మూడు కొత్త మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్మూర్‌ నియోజకవర్గంలో డొంకేశ్వర్‌, ఆలూరు, బోధన్‌ నియోజకవర్గంలో పరిధిలో సాలూర మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్త ర్వులకు అనుగుణంగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రెండు మండలాలు, బోధన్‌ డివిజన్‌ పరిదిలో ఒక మండలం ఏర్పాటు చేయనున్నారు. 

ఎదురుచూస్తున్న స్థానిక ప్రజలు

జిల్లాలో ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కొత్తమండలాలను ఏర్పాటు చే యాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. జిల్లా విభజన సమయంలో నే ఈ మూడు మండలాలనుఏర్పాటు చేస్తారని భావించినా.. అప్పటి పరిస్థితుల బట్టి కొత్తమండలాలను ఏర్పాటు చేయలేదు. నందిపేట మండలం లో కొత్తగా డొంకేశ్వర్‌ కేంద్రంగా మండలకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో అత్యధిక గ్రామాలు ఉన్న మండలం కా వడంతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్నారు. డొంకేశ్వర్‌, కొండాపూర్‌, దత్తాపూర్‌, గంగసముదంర్‌, సిర్పూర్‌, అన్నారం, మారంపల్లి, నూత్‌పల్లి, నడ్కుడ, గాదేపల్లి, కోమట్‌పల్లి, నికాల్‌పూర్‌ గ్రామా లను కొత్త మండలం పరిధిలో చేర్చారు.  ఆర్మూర్‌ అతి పెద్దమండలంగా ఉంది. మున్సిపాలిటీ కూడా కలిసి ఉండడంతో పరిపాలనపరమైన ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఆర్మూర్‌ పరిధిలో ఆలూరు మండలకేంద్రంగా ప్రకటించారు. ఈ మండలంలో పది గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చే స్తున్నారు. ఆలూరు, మిర్దాపల్లి, దేగాం, మాచర్ల, దగ్గుపల్లి, రాంపూర్‌, సిద్దాపూర్‌, వన్నెల్‌, కల్లెడ, గుత్ప గ్రామాలను కలుపుతూ ఈ కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండలం ఏర్పాటు కావడం వల్ల మున్సిపల్‌తో పాటు ఇతర గ్రామాలు సరైన సేవలు అందనున్నాయి.  బోధన్‌ మండలం అతిపెద్దదిగా ఉంది. మున్సిపాలిటీతో పాటు గ్రామాలు కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూరాను మండలకేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే సాలూరా మండలా న్ని 17 గ్రామాలతో చేస్తున్నారు. సాలూర, మందర్ణ, హున్సా, ఖాజాపూర్‌, ఫత్తేపూర్‌, తగ్గెల్లి, సాలంపాడ్‌, లక్మాపూర్‌, కోమన్‌పల్లి, జాడిజమాల్‌పూర్‌, రాంపూర్‌, కల్దుర్కి, సిద్దాపూర్‌, తడగం, బిక్కనెల్లి, హంగర్గ, కొప్పెర్గ గ్రామా లు కొత్తమండలం పరిదిలో కలిపారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పాటు ఈ మండలాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు. 

ఈ కొత్త మండలాల పూర్తి ఏర్పాటుకు నెల రోజుల్లో ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను ప్రకటించనున్నారు. ఏవైనా అభ్యంతరాలు వస్తే ముఖ్యమైనవి అయితే మార్పులు చేర్పులను చేయనున్నారు. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభు త్వం ప్రిలిమినరి డ్రాఫ్ట్‌ను విడుదల చేసిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ఈ డ్రాఫ్ట్‌కు అనుగుణంగానే మండలాలు అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.  

కాగా, తమ నియోజకవర్గాల పరిధిలో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసినందుకు ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

సుభాష్‌నగర్‌: నూతన మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం నూతన మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.  


Updated Date - 2022-07-24T05:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising