ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy Dist.: ఎట్టకేలకు కొండరాళ్ల గుహలో ఇరుక్కున్న రాజు క్షేమం..

ABN, First Publish Date - 2022-12-15T14:38:10+05:30

కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం, సింగరాయిపల్లి అడవిలోని కొండరాళ్ల గుహలో ఇరుక్కున్న యువకుడు రాజును ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందం కాపాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం, సింగరాయిపల్లి అడవిలోని కొండరాళ్ల గుహలో ఇరుక్కున్న యువకుడు రాజును ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందం కాపాడారు. బండరాళ్ల మధ్య నుంచి రాజును క్షేమంగా బయటకు తీశారు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అడవిలో వేటకు వెళ్లిన రాజు ప్రమాదవశాత్తు గుహలో చిక్కుకున్నాడు. మంగళవారం నుంచి గుహలోనే ఇరుక్కుని నరకం అనుభవించాడు. 43 గంటలపాటు శ్రమించి బాధితుడిని రెస్క్యూ బృందం రక్షించారు.

సహాయక చర్యలు ప్రారంభించిన తర్వాత బాధితుడు రాజుకు మంచినీళ్లు, ఓఆర్ఎస్, జ్యాస్ అందించారు. జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం సాయంత్రం సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో రాజు షికారుకు వెళ్లాడు. ఆ సమయంలో రాళ్లపై నుంచి వెళుతుండగా సెల్ ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యకు జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు.

వేటకు వెళ్లిన కారణంగా కుటుంబసభ్యులు, స్నేహితులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాజును బయటకు తీసేందుకు బుధవారం మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు రిస్క్యూ బృందం, యంత్రాల ద్వారా రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2022-12-15T14:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising