ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌

ABN, First Publish Date - 2022-12-16T00:51:14+05:30

రామారెడ్డి మండలం రాజు సింగరాయిపల్లి అటవీప్రాంతంలో వేటకు వెళ్లి పులికొండ గుహలో చిక్కుకున్న రాజు ను వెలికితీసేందుకు అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆప రేషన్‌ ఎట్టకేలకు విజయవంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుహలో చిక్కుకున్న రాజును రక్షించిన రెస్క్యూటీమ్‌

కామారెడ్డి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి)/ మాచారెడ్డి: రామారెడ్డి మండలం రాజు సింగరాయిపల్లి అటవీప్రాంతంలో వేటకు వెళ్లి పులికొండ గుహలో చిక్కుకున్న రాజు ను వెలికితీసేందుకు అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆప రేషన్‌ ఎట్టకేలకు విజయవంతమైంది. గుహలోచిక్కుకపోయిన రాజును బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్‌తో పాటు అధికార యంత్రాంగం నిర్విరామంగా కష్టపడడం తో ఫలితం దక్కింది. ఎట్టకేలకు రాజును సురక్షితంగా గు హలోంచి బయటకు తీయడంతో అందరు ఉపిరి పిల్చుకున్నారు. రాజును బయటకు తీసేందుకు అతని స్నేహితుడు అశోక్‌ రెస్క్యూ టీమ్‌కు చాలా ఉపయోగపడ్డాడు.

మూడు రోజుల క్రితం వేటకు వెళ్లి..

రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన ఈ నెల 13న రాజు అతడి మిత్రుడు మహేష్‌తో కలిసి అటవీ జంతువులను వేటాడేందుకు సింగరాయిపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో పులిగుట్ట నుంచి వెళ్తుండగా రాజు సెల్‌ఫోన్‌ రాళ్లబండ గుహలో పడిపోయింది. దానిని తీయడానికి రాజు గుహలోకి ది గాడు. సెల్‌ఫోన్‌ తీసుకుని పైకి వస్తుండగా అతని కుడిభుజం రాళ్లమధ్యలో ఇరుకుపోవడంతో బయటకు రాలే క పోయాడు. దీని గమనించిన మహేష్‌ రాత్రంతా అక్క డే ఉండి రాజును బయటకు తీసే ప్రయత్నం చేశాడు. బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులకు గ్రామస్థులకు తెలపడంతో వారంతా ఘటన స్థలానికి వెళ్లి రాజును బయటకు తీసే ప్రయత్నంచేశా రు. అయినప్పటికీ ఫలించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిం చారు. బుధవారం అర్థరాత్రి వరకు పోలీసులు రెవెన్యూ, అగ్నిమాపక, అటవీశాఖల అధికారులు జేసీబీల సహయంతో రాళ్లను పగలగొట్టి రాజును బయటకు తీసేందు కు ప్రయత్నించగా ఫలించలేదు. గురువారం మధ్యా హ్నం వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూ వచ్చింది. రాజు గుహలో తలకిందులుగా ఇరుకుపోవడం శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం,రెండురోజుల పాటు ఎలాంటి ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాడు.ఎలాంటి ఆహారం,నీటిని తీసుకోకపోవడంతో నీరసించిపోయాడు. పక్కనే ఉన్న బండరాళ్లను జేసీబీతో, డ్రిల్లింగ్‌ మిషన్‌లతో పగలగొట్టే సమయంలో బండ రాళ్లు కదిలి శరీరానికి ఒత్తుకు పోయాయి. దీంతో రాజు ఆ గుహలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా ఉంటేనే వచ్చాడు. ఇదే క్రమంలో పోలీసులు, వైద్యులు రాజుకు వేరే మార్గం నుంచి నీరు, ఓఆర్‌ఎస్‌ తాగించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆక్సిజన్‌ను అందిస్తు అతనికి ధైర్యం చెబుతూ వచ్చారు. రాజును బయటకు తీసేక్రమంలో రాళ్లు విరగడంతో యువకుడి శరీరానికి, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో సంఘటన స్థలం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం రాజు ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని కామారెడ్డి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 43 గంటల పాటు నరకయాతన అనుభవించిన రాజు అధికారుల రెస్క్యూ ఆపరేషన్‌తో మృత్యువును జయించాడు.

Updated Date - 2022-12-16T00:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising