ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంతకులను శిక్షించాల్సిందే..

ABN, First Publish Date - 2022-08-04T06:15:13+05:30

తల్లీ కొడుకులను హత్యచేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మోర్తాడ్‌కు చెందిన లత అలియాస్‌ శారద, కొడుకు హర్షలను హత్య చేసి మండలంలోని గాండ్లపేట్‌ పెద్దవాగు బ్రిడ్జి కింద పడవేసిన వేయగా.. బుధవారం జిల్లా వ్యాప్తంగా మోర్తాడ్‌కు తరలివచ్చిన ఎరుకల కులస్థులు జాతీయ రహదారిపై బైఠాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోర్తాడ్‌లో మృతుల బంధువుల ఆందోళన

అత్తింటి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌

మోర్తాడ్‌, ఆగస్టు 3: తల్లీ కొడుకులను హత్యచేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మోర్తాడ్‌కు చెందిన లత అలియాస్‌ శారద, కొడుకు హర్షలను హత్య చేసి మండలంలోని గాండ్లపేట్‌ పెద్దవాగు బ్రిడ్జి కింద పడవేసిన వేయగా.. బుధవారం జిల్లా వ్యాప్తంగా మోర్తాడ్‌కు తరలివచ్చిన ఎరుకల కులస్థులు జాతీయ రహదారిపై బైఠాయించారు. తల్లీ కొడుకులను అత్తింటివారే హత్యచేశారని మండిపడ్డారు. మృతురాలి బావ, ఆయన భార్య, ఆడకూతురు భర్త కలిసి తల్లీ కొడుకులను దారుణంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసేంత వరకూ రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించారు. దీంతో మోర్తాడ్‌ ఎస్సై ముత్యంరాజ్‌తో పాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాలకు చెందిన ఎస్సైలు, సిబ్బంది తరలివచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. బుధవారం సాయంత్రం తల్లీకొడుకుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.  

ఫ కారు అద్దాలు ధ్వంసం..

మంగళవారం రాత్రి మృతురాలి బావతోపాటు మరొకరు కారులో పోలీసు స్టేషన్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధు వులు పోలీసుస్టేషన్‌కు తరలివచ్చి మృతురాలి బావను తమకు అప్ప గించాలని ఆందోళన చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. 

ఫ ఆస్తికోసమే హత్య

పెద్దబజార్‌: ఆస్తి కోసమే తన సోదరి, మేనల్లుడిని ఆమె భర్త కుటుంబ సభ్యులు హత్య చేశారని తమకు న్యాయం చేయాలని మృతురాలి సోదరుడు వెంకటేష్‌ వేడుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆస్తి అమ్మగా వచ్చిన సొత్తు విషయంతో ఈ హత్యలు జరిగాయన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎవరికీ వత్తాసు పలకకుండా తమకు న్యాయం చేయాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-04T06:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising