ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-01-28T06:54:20+05:30

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుప్కల్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై గంగుల శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం.. కుప్కల్‌ గ్రా మశివారులోని తెల్లపలుగు ప్రాంత అడవిలోకి మూడ్‌ బద్దు (48) కట్టెల కోసం ఉదయం 4 గంటల ప్రాంతంలో వెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్‌గల్‌ రూరల్‌, జనవరి 27: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుప్కల్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై గంగుల శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం.. కుప్కల్‌ గ్రా మశివారులోని తెల్లపలుగు ప్రాంత అడవిలోకి మూడ్‌ బద్దు (48) కట్టెల కోసం ఉదయం 4 గంటల ప్రాంతంలో వెళ్లాడు. అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు షికారు కోసం అమర్చిన విద్యుత్‌ వైర్లు మృతుడి కాళ్లకు తగిలాయి. దీంతో అక్కడికక్కడే బద్దు చనిపోయాడు. ఉదయం పూట అటువైపుగా వెళ్లిన గ్రామస్థులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందిం చారు. పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కొందరు బద్దును కక్ష్యపూరితంగా పథకం ప్రకారం చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేవరకు శవాన్ని తీసుకెళ్లనీయమని వాదించడం తో పోలీసులకు గ్రామస్థులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. నిందితులను  పట్టుకుని న్యాయం జరిగేలా చూస్తామని సీఐ వెంకటేశ్వర్లు చెప్పడంతో శాంతించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2022-01-28T06:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising