ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-07-05T06:13:38+05:30

పశువుల అక్రమరవాణాను అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూలై 4: పశువుల అక్రమరవాణాను అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అ నుమతి లేకుండా గోవులను రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా గోవులను రవాణాచేస్తే చట్ట ప్ర కారం చర్యలు తీసుకుంటామన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జ రుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. జూలై 15 వరకు హైవే పెట్రోలింగ్‌ చేస్తామని తెలిపారు. గోవుల అక్రమరవాణా జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద వెటర్నరీవైద్యులు, పోలీసులు ఉంటారని తెలిపారు. సమావేశంలో ఏఎస్‌పీ అనోన్య, ఆర్‌డీవో శ్రీను పాల్గొన్నారు.

జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధవహించాలి

జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిలా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువులు, మూగజీవాల సంరక్షణపై సమావేశం నిర్వహించారు. మూఢనమ్మకాలతో బహిరంగ ప్రదేశాలలో జంతువుల బలిచేయరాదని, ఎవరైనా జంతుబలి చేస్తేచట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జంతువులపై అధిక బరువు మోపడం, పరిమితికి మించి రవాణా చేయవద్దని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖాధికారి జగన్నాథచారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T06:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising