ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఆదర్శం : స్పీకర్‌

ABN, First Publish Date - 2022-03-05T06:09:55+05:30

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలవడంతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేయడం హర్షనీయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోటగిరి, మార్చి 4 :
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలవడంతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేయడం హర్షనీయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని పొతంగల్‌ గ్రామంలో శుక్రవారం స్పీకర్‌ పర్యటించారు. గ్రామంలో సుమారు రూ.14కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు భీమా, పథకాలతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించారన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ ఫామ్‌ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నియోజక వర్గ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, జడీ ్పటీసీ శంకర్‌పటేల్‌, ఎంపీపీ సునీత, వర్ని, శంకర్‌, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌ పటేల్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-03-05T06:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising