ఏడో రోజూ కొనసాగిన ఎంపికలు
ABN, First Publish Date - 2022-12-16T01:25:49+05:30
పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జరుగుతున్న ఎంపికలు 7వ రోజు కొనసాగాయి. గురువారం 1206 మంది అభ్యర్థులను పిలవగా అందులో 1024మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
ఖిల్లా, డిసెంబరు 15: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జరుగుతున్న ఎంపికలు 7వ రోజు కొనసాగాయి. గురువారం 1206 మంది అభ్యర్థులను పిలవగా అందులో 1024మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరికి పరుగు పందెం, ఎత్తు, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించగా 505 మంది అర్హత సాధించినట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఎంపికలను సీపీ నాగరాజు పర్యవేక్షించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అర్వింద్‌బాబు, ఏసీపీలు ఏ.వెంకటేశం, ప్రభాకర్‌రావు, కిరణ్‌కుమార్, నారాయణ తదితర సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు.
Updated Date - 2022-12-16T01:25:50+05:30 IST