ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబంధు ఎప్పుడో?

ABN, First Publish Date - 2022-12-15T00:41:20+05:30

పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే ముందుగా చెల్లించి రైతులను ఆర్థికంగా గట్టెక్కించాలనే ఉద్ధేశ్యంతో 2018లో రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సాయంపై ఎటువంటి ప్రకటన చేయని ప్రభుత్వం

- గత ఏడాది డిసెంబరులోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమైన డబ్బులు

- ఈసారి ఆలస్యం కావడంతో రైతులకు తప్పని ఎదురుచూపులు

- జిల్లాలో 2.82 లక్షల మంది రైతుబంధు లబ్ధిదారులు

- గత వానాకాలంలో రూ.253 కోట్లు కేటాయింపు

కామారెడ్డి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే ముందుగా చెల్లించి రైతులను ఆర్థికంగా గట్టెక్కించాలనే ఉద్ధేశ్యంతో 2018లో రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాటి నుంచి మొదట్లో రెండు విడతల్లో రూ.8వేలు, తర్వాత రూ.5వేల చొప్పున రెండు విడతల్లో రూ.10 వేలు సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్‌లో జమ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కాగా 2022 యాసంగి సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. అయినా ఈ సీజన్‌లో రైతుబంధు సాయాన్ని రైతులకు ఎప్పుడిస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

2.82 లక్షల మంది నిరీక్షణ

గత ఏడాది యాసంగి సీజన్‌లో 2.72 లక్షల మందికి రైతుబంధు నిధులు ఖాతాలో జమ కాగా గడిచిన వానాకాలం సీజన్‌లో 2.82 లక్షల మంది రైతులు రైతుబంధు సాయం అందుకున్నారు. వీరందరికీ ఆయా సీజన్‌ ప్రారంభంలోనే ఎకరం నుంచి మొదలుకొని రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతూ వచ్చాయి. అయితే ఈ సీజన్‌లో రైతాంగానికి రైతుబంధు సాయం ఎప్పుడు ఇస్తారనే ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే శనగ, మొక్కజొన్న, వరి లాంటి పంట సాగు మొదలుకావడం, వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు స్థానికంగా డీలర్ల వద్ద ఈ రైతుబంధు సాయం వస్తుందని చెప్పి ఖాతాలకు తీసుకువస్తున్నారు. మరికొందరు పెట్టుబడికై వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడంతో పాటు దుక్కులు దున్నుతున్నారు. రైతుబంధు డబ్బులు వస్తే ఎంతో కొంత ఆసరాగా ఉండేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికీ జమ చేయకపోవడంతో జిల్లాలో 2.82 లక్షల మంది రైతుబంధు లబ్ధిదారులు పెట్టుబడి సాయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

కొత్త వారికి అవకాశం ఇచ్చేనా?

గతేడాది రైతుబంధుకు కొత్తగా అర్హులైన వారిలో యాసంగిలో 14,430 మంది, వానాకాలంలో 10,284 మందికి సాయం అందించారు. భూముల కొనుగోలు అమ్మకాలు జరగడం, పట్టామార్పిడి జరిగిన వారి పేర్లను రైతుబంధుకు ప్రతీ సీజన్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంటారు. కొందరు మృతి చెందడం, మరికొందరు ఖాతాలు మార్చడం, పాసుపుస్తకం బ్యాంక్‌ అకౌంట్‌లు ఒకే విధంగా లేకపోవడం సంబంధిత పత్రాలు వ్యవసాయ అధికారులకు ఇవ్వకపోవడం లాంటి కారణాలతో వీరికి రైతుబంధు అందకుండా పోయింది. ఇలాంటి రైతులు వ్యవసాయ అధికారులను కలిసి సవరించుకునే అవకాశం కల్పించారు. అయితే గత వానాకాలం సీజన్‌ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు 5 వేల మందికి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసింది. అయితే కొత్తగా పుస్తకాలు వచ్చిన రైతులకు రైతుబంధు సాయం ఇస్తారా లేదా అనేదానిపై కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ సీజన్‌లో రైతుబంధు సాయాన్ని పాత వారితో పాటు కొత్తవారికి అవకాశం కల్పించి త్వరగా అందించాలని రైతులు కోరుతున్నారు.

యాసంగి సాగులో రైతులు బిజీబిజీ

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. యాసంగి పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కులు దున్నుతున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ లాంటి ప్రాంతాల్లో వరి నాట్లు సైతం వేస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు వరిని సాగు చేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే శనగ వేల ఎకరాల్లో సాగవుతోంది. మొక్కజొన్న విత్తనాలను విత్తుతున్నారు. ఈ యాసంగి సీజన్‌లో దాదాపు జిల్లా వ్యాప్తంగా 4.23 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది.

Updated Date - 2022-12-15T00:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising